Bichkunda: బిచ్కుందకు చేరిన 'రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా' పాదయాత్ర

Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చేరిన 'RaGa for Rise of India' పాదయాత్ర. సామాజిక కార్యకర్త కాటూరి వెంకటేశ్వర్లుకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు.

VEERANNA, JUKKAL
Published on: 24 Sept 2026 8:18 PM IST
Bichkunda
X

Bichkunda: బిచ్కుందకు చేరిన 'రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా' పాదయాత్ర

బిచ్కుంద: బిచ్కుంద (కామారెడ్డి ) దేశవ్యాప్తంగా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలు, ఆకాంక్షలను తెలుసుకునే లక్ష్యంతో కొనసాగుతున్న “RaGa for Rise of India” జాతీయ పాదయాత్ర జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రానికి చేరుకుంది.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగుతున్న ఈ పాదయాత్రకు బిచ్కుందలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన ఈ పాదయాత్ర 2026 జూన్ 19న కన్యాకుమారిలో ప్రారంభమైంది.

తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా ఇప్పటికే 1700 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తిచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఐక్య, సమ్మిళిత, ప్రగతిశీల భారతదేశ నిర్మాణం కోసం ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు, సమస్యలు, ఆకాంక్షలనుతెలుసుకోవడమే పాదయాత్ర ఉద్దేశమని కాటూరి వెంకటేశ్వర్లు తెలిపారు.

బిచ్కుందలో పాదయాత్ర బృందానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగనాథ్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ భర్త ప్రేమ్ సెట్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రవి పాటిల్,విశ్రాంత ఉపాధ్యాయుడు గంగారాం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

అనంతరం కాటూరి వెంకటేశ్వర్లును శాలువాతో సన్మానించారు.కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగుతున్న ఈ ప్రజా పాదయాత్రకు ప్రజల ఆశీస్సులు, మద్దతు, మార్గదర్శకత్వం అందించాలని నిర్వాహకులు కోరారు.కార్యక్రమం లో జాదవ్. పండరి, గుండె నేమ్లిఉప సర్పంచ్ సాయిలు, అనిల్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL