Kamareddy: పోలీసుల విధులకు ఆటంకం కామారెడ్డిలో మూడు డిజే వాహనాలు సీజ్
Kamareddy: కామారెడ్డి జిల్లా నర్వ గ్రామంలో అనుమతి లేని డిజే స్పీకర్లపై పోలీసుల చర్యలు. 3 డిజే వాహనాలు సీజ్, విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు.
Kamareddy: పోలీసుల విధులకు ఆటంకం కామారెడ్డిలో మూడు డిజే వాహనాలు సీజ్
కామారెడ్డి: నర్వ దుర్గ మత నవరాత్రి ఉత్సవాల సందర్బంగా డిజే స్పీకర్లు తొలగించలన్న పోలీస్ శాఖ ఆదేశాలను బేఖాతారు చేయకుండ విధులకు ఆటంకం కల్గించిన పలువురు వ్యక్తులపై కేసు నమోదు చేసి మూడు డిజే వాహనాలను సిజ్ చేసినట్లు నిజాంసాగర్ ఎస్సై జె. శివకుమార్ తెలిపారు.
పోలీస్ లు మీడియా కు వెల్లడించిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలం నర్వ గ్రామం లో ఈనేలా 21నా రాత్రి సుమారు 7 గంటల ప్రాంత సమయంలో నర్వ గ్రామంలోని దుర్గామాత మండపం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలు భరించలేనంతగా అధిక శబ్దం తో డిజే స్పీకర్లు ఏర్పాటు చేసినట్లు కొందరి ద్వార పోలీస్ లకు సమాచారం అందింది.
సమాచారం అందుకున్న సాగర్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని డిజే స్పీకర్లను తొలగించాలంటూ సంబంధిత వ్యక్తులకు సూచించారు. అయిన వారు డిజే స్పీకర్లను తొలగించకుండ పోలీస్ ల విధులకు ఆటంకం కల్గించినట్లు పోలీస్ లు ఓ ప్రకటన లో పేర్కొన్నారు. దింతో వెంటనే డిజే స్పీకర్లు ఏర్పాటు చేసిన మూడు వాహనాలను సిజ్ చేసి పోలీస్ ల విధులకు ఆటంకం కల్గించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు నిజాంసాగర్ ఎస్సై తెలిపారు.
డిజే స్పీకర్లు వాడడం ద్వార చోటు చేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అనుమతులు లేకుండా అధిక శబ్దం తో డిజెలు నిర్వహించడం, పోలీస్ విధులతో పాటు ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహించే ఉద్యోగులకు ఆటంకం కల్గించడం లాంటి వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ లు స్పష్టం చేశారు.




