Kamareddy: వాగ్వివాదాలు, గందరగోళం మధ్య కామారెడ్డి కౌన్సిల్ సమావేశం!

Kamareddy: కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల వాగ్వివాదాలతో రసాభాసగా మారింది. అక్రమ వసూళ్ల ఆరోపణలపై ఎమ్మెల్యే కాటిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

MADHU, KAMAREDDY
Published on: 18 Nov 2026 4:22 PM IST
Kamareddy
X

Kamareddy: వాగ్వివాదాలు, గందరగోళం మధ్య కామారెడ్డి కౌన్సిల్ సమావేశం!

కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం గందరగోళం, వాగ్వివాదాల మధ్య కొనసాగింది. చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే కౌన్సిల్ హాల్ నుంచి బయట వ్యక్తులకు వీడియో కాల్స్ చేస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్‌ను బయటకు వెళ్లాలని ఎమ్మెల్యేతో పాటు బీజేపీ కౌన్సిలర్లు కోరడంతో వివాదం మొదలైంది. దీనికి నిరసనగా కాంగ్రెస్ కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయించడంతో ఇరుపార్టీల సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

మరోవైపు మున్సిపల్ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ట్రీ బ్లెస్సింగ్, ఇంటి నిర్మాణ అనుమతుల విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కౌన్సిలర్లు సైతం వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ప్రజలకు అందాల్సిన మున్సిపల్ సేవల విషయంలో అక్రమ వసూళ్లకు తావులేకుండా చూడాలని అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం.. మరోవైపు వసూళ్ల ఆరోపణలపై ఎమ్మెల్యే ఆగ్రహంతో సమావేశం రసాభాసగా మారింది. మున్సిపాలిటీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు సమావేశంలో చర్చనీయాంశంగా మారాయి.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY