Jukkal: నక్కకు పునర్జన్మనిచ్చిన పశువైద్యుడు: జుక్కల్‌లో ఘటన!
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం చిన్న ఎడ్గిలో అస్వస్థతకు గురైన నక్కకు పశువైద్యుడు చికిత్స అందించి ప్రాణం పోశారు.
Jukkal: నక్కకు పునర్జన్మనిచ్చిన పశువైద్యుడు: జుక్కల్‌లో ఘటన!
జుక్కల్: అడవిలో ప్రశాంతంగా జీవించే నక్క ఆరోగ్యం కాస్త దెబ్బ తిని అస్వస్థతకు గురై గ్రామ పొలిమేరలో గ్రామస్థుల కంట పడడంతో వారు తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న జుక్కల్ అటవీశాఖ బిట్ ఆఫీసర్ రాములు వెంటనే జుక్కల్ మండలం చిన్న ఎడ్గి గ్రామానికి చేరుకొని నక్క ను మెరుగైన చికిత్స కోసం తన ద్విచక్ర వాహనం పై జుక్కల్ ప్రాథమిక పశు వైద్య అస్పత్రి కి తీసుకెళ్లి పశు వైద్యుడు డాక్టర్. పండరినాథ్ చే వైద్యం చేయించి నక్క పూర్తిగా కోలుకున్నాక సురక్షతంగా సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి వదిలిపెట్టారు. మానవత్వం తో అనారోగ్యం కారణంగా బాధపడ్తున్న నక్క ను కాపాడినందుకు పశు వైద్య శాఖధికారికి అటవీశాఖ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.




