Jukkal: హెచ్ఎంటీవీ డిజిటల్ వార్తకు స్పందన.. ఎస్సీ కాలనీలో వెలుగులు!
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మొహమ్మదాబాద్ ఎస్సీ కాలనీలో విద్యుత్ సమస్యపై హెచ్ఎంటీవీ డిజిటల్ న్యూస్లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు.
Jukkal: హెచ్ఎంటీవీ డిజిటల్ వార్తకు స్పందన.. ఎస్సీ కాలనీలో వెలుగులు!
జుక్కల్: జుక్కల్ మండలం మొహమ్మద బాద్ గ్రామ ఎస్సి కాలనీ చీకట్లో మగ్గుతున్న ప్రజలు అనే శీర్షిక పై హెచ్ ఎం టి వి డిజిటల్ వెబ్ లో ప్రచురితమైన వార్తకు స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది ఎస్సి కాలనిలో విద్యుత్ సమస్య ను పరిష్కరించారు.
ఈ విషయం పై స్పందించిన గ్రామ సర్పంచ్ సూర్నర్ శకుంతల ప్రజ్ఞేష్ కుమార్ (బాలు సార్ ) సైతం విద్యుత్ సమస్య పరిస్కారమయ్యే వరకు సిబ్బంది తో ఉండి సమస్య పూర్తిగా పరిష్కరించి నందుకు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.
శుక్రవారం నుండి శనివారం ఉదయం వరకు కాలనిలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో కాలనీ ప్రజలు నీటి సమస్య కు గురయ్యారని విద్యుత్ సమస్య తిరడంతో కాలనిలో గల సింగిల్ పేష్ బోర్ ను సర్పంచ్ ప్రారంభించి నీటి సదుపాయం కల్పించారు.
ఇక మీదట కాలనిలో ఎలాంటి సమస్య లు తలెత్తకుండ తాగు జాగ్రత్త లు తీసుకుంటామని కాలనీ వాసులకు సర్పంచ్ భరోసా ఇచ్చారు. కార్యక్రమం లో విద్యుత్ శాఖ లైన్ మాన్ జిలాని, వార్డ్ సభ్యుడు పి.శంకర్,పంచాయతీ కార్యదర్శి జీవన్ తదితరులు పాల్గొన్నారు.




