Jukkal: జుక్కల్ మండలంలో ఘనంగా బాలల దినోత్సవం, ప్రత్యేక గ్రామసభలు!
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్, డోన్ గావ్, లొంగన్ గ్రామాల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు, ప్రత్యేక గ్రామసభలు ఘనంగా నిర్వహించారు.
Jukkal: జుక్కల్ మండలంలో ఘనంగా బాలల దినోత్సవం, ప్రత్యేక గ్రామసభలు!
జుక్కల్: జుక్కల్ మండలం లొని బస్వాపూర్, డోన్ గావ్ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్,లొంగన్ సర్పంచ్ ఉషారాణి సదు పాటిల్ తదితర గ్రామాల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం, ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్బంగా జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తూర్బ గాంధీ బాలికల గురుకుల విద్యాలయం లో గ్రామ కార్యదర్శి భారద్వాజ్ అధ్యక్షతన నిర్వహించిన దినోత్సవం లో భాగంగా సర్పంచ్ భర్త డబ్ల్యూ. సురేష్ గొండ పాఠశాల విద్యార్థినిలతో కలిసి బాలల దినోత్సవం లో పాల్గొనడమే కాకుండా వారి సమస్యలు, అవసరాలతోపాటు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల హక్కులు, విద్య, ప్రధానంగా అందరికి మెరుగైన ఆరోగ్యం వారి ఉజ్వల భవిష్యత్ కోసం తమ గ్రామ పంచాయతీ విద్యార్థుల ఎదుగుదల కోసం ప్రత్యేక కృషి చేస్తామని పాఠశాల విద్యార్థినిలకు హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే తరానికి అసలైన వారసులు దేశ భవిష్యత్ కు వారదులు ఐన విద్యార్థులు ఇష్టంతో కస్టపడి ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని దేశ ప్రయోజనాల కోసం ప్రతి విద్యార్థిని దేశానికి కీర్తి తెచ్చి పెట్టాలని కోరారు.
ఇంతమంచి కార్యక్రమాన్ని పాఠశాల లో నిర్వహించడం తమాకెంతో ఆనందనిచ్చిందని తమ గ్రామ పంచాయతీ పక్షాన పాఠశాల యాజమాన్యానికి అభినందించారు.అనంతరం పాఠశాల విద్యార్థినిలకు పెన్నులు, నోట్ బుక్ లను అందజేశారు.కార్యక్రమం లో ఐ కె పి సి సి సంజు, గ్రామ యువ నాయకుడు తాటివర్ మధు, ఐ కె పి వి ఓ ఏ భాస్కర్ తోపాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినిలు పాల్గొన్నారు.




