Jukkal: మద్నూర్‌లో రైతుల మహాధర్నా: కరువు మండలంగా ప్రకటించాలి!
Jukkal: కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా చేపట్టారు. నాణ్యమైన విద్యుత్, పంట నష్టపరిహారం కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
Jukkal: మద్నూర్‌లో రైతుల మహాధర్నా: కరువు మండలంగా ప్రకటించాలి!
జుక్కల్: మద్నూర్ అరుగలం కష్టపడే రైతన్నలకు పంట సాగుకోసం అవసరమైన నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు, నష్ట పోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించి కరువు మండలంగా ప్రకటించాలని కోరుతు సోమవారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రం లొని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు మహా ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చెయ్యాలని, నష్ట పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంత మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయాన్నే నమ్ముకొని బతుకులేళ్లదిస్తున్న రైతులకు రైతులు పండించిన పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులు ఎదుర్కొంటున్న సమస్య లను ప్రభుత్వం వెంటనే పరిష్కారించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని బి కె ఎస్ నాయకులు, రైతులు విజ్ఞప్తి చేశారు. అనంతరం మద్నూర్ డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ధర్నా లో భారతీయ కిసాన్ సంఘ్ కార్యకర్తలు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




