Kamareddy: పర్యావరణ పరిరక్షణే ధ్యేయం: ‘వసుంధర పాయి దిండి’ పాదయాత్ర

Kamareddy: జగద్గురు నరేంద్రాచార్యాజీ జన్మదినం సందర్భంగా జుక్కల్ ఉపపీఠం నుంచి రత్నగిరి వరకు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా భక్తులు పాదయాత్ర చేపట్టారు.

VEERANNA, JUKKAL
Published on: 27 Sept 2026 6:56 PM IST
Kamareddy
X

Kamareddy: పర్యావరణ పరిరక్షణే ధ్యేయం: ‘వసుంధర పాయి దిండి’ పాదయాత్ర

Kamareddy: డోన్ గావ్ (కామారెడ్డి ) క్షేత్ర దక్షిణపీఠ్ నానిజ్ ధామ్ రత్నగిరి పీఠాధిపతి జగద్గురు రామానందాచార్య నరేంద్రచార్యాజీ జన్మదినాన్ని పురస్కరించుకుని భక్తులు పర్యావరణ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. జుక్కల్ మండలంలోనిదోస్‌పల్లి–బంగారుపల్లి వద్ద ఉన్న శ్రీ క్షేత్ర తెలంగాణ ఉపపీఠం నుంచి ఆదివారం వందలాది మంది భక్తులు మహారాష్ట్రలోని రత్నగిరి వద్ద గల శ్రీ క్షేత్ర దక్షిణపీఠ్ నానిజ్ ధామ్‌కు ‘వసుంధర పాయి దిండి’ పేరుతో పాదయాత్రగా బయలుదేరారు.

పాదయాత్రలో భాగంగా డోన్‌గావ్, సోపూర్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశించిన భక్తులు డోన్ గావ్ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోపూర్ ప్రాంతంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణను ప్రధాన లక్ష్యంగా చేసుకుని భక్తి కార్యక్రమాలతో పాటు సామాజికసేవాకార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని సేవా సమితి సభ్యులు తెలిపారు.

శ్రీ క్షేత్ర తెలంగాణ ఉపపీఠం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణతో పాటు రక్తదానం, అవయవదానం, ఉచిత అంబులెన్స్ సేవలు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. భక్తి మార్గంతో పాటు సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం స్ఫూర్తిదాయకమని సేవా సమితి సభ్యులు తెలిపారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL