Kamareddy: చికెన్ వ్యర్థాల టెండర్‌పై వెల్లువెత్తిన అక్రమాల ఆరోపణలు!

Kamareddy: కామారెడ్డి మున్సిపాలిటీలో చికెన్ వ్యర్థాల సేకరణ టెండర్ ప్రక్రియపై వివాదం. మున్సిపల్ ఆదాయానికి నష్టం వాటిల్లిందని, రీ-టెండర్ నిర్వహించాలని బాధితుడి ఫిర్యాదు.

MADHU, KAMAREDDY
Published on: 29 Oct 2026 4:49 PM IST
Kamareddy
X

Kamareddy: చికెన్ వ్యర్థాల టెండర్‌పై వెల్లువెత్తిన అక్రమాల ఆరోపణలు!

కామారెడ్డి: చికెన్ వ్యర్థాల సేకరణ నిర్వహించిన టెండర్ ప్రక్రియ సరిగాలేదని వెంటనే తిరిగి నిర్వహించాలని బాధితుడు రాకేష్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన కామారెడ్డిలో మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చికెన్ వ్యర్థాల సేకరణ నిమిత్తం నిర్వహించిన దరఖాస్తులను టెండర్ బాక్స్ లో వేసి సిల్ చేసి కోడ్ చేసిన అందరి సమక్షంలో తీయాల్సి ఉండగా అధికారులు నిబంధన విరుద్ధంగా తీశారని తెలిపారు .

కవర్లు అధికారులు తీసుకొని వాటిని తీయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కామారెడ్డి మున్సిపాలిటీ కాకుండా ఇతర జిల్లాల్లో సుమారు 8 నుంచి 12 లక్షల వరకు టెండర్ నిర్వాహన జరిగిందని తెలిపారు. కామారెడ్డి లో మాత్రం రెండు లక్షల 30 వేలు మాత్రమే వెళ్లడం విచిత్రంగా ఉందన్నారు. మున్సిపల్ ఆదాయానికి నష్టం జరుగుతుందని ,సంబంధిత అధికారులు తిరిగి నిర్వహించాలని కోరారు.

పేపర్ ప్రకటనలో కూడా కొద్దిపాటి సమయాన్ని ఇచ్చారని అందరికీ సమాచారం తెలియజేసేలా ఉండాలన్నారు. టెండర్ నిర్వహణ లో సరైన విధానంగా లేదని తిరిగి పెట్టాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ తోపాటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.

టెండర్ నిర్వహణలో మున్సిపల్ కమిషనర్ తో పాటు డీఈలను పత్రిక విలేకరులు వివరణ కోరగా సమావేశానికి వెళుతున్నామని దాటవేశారు. కాగా ఇదే విషయంపై రి టెండర్ కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ చైర్ పర్సన్ లకు కొందరు కౌన్సిలర్లు వారం రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం కూడా 3 లక్షల పైగా చికెన్ సేకరణకు టెండర్ వేయగా ప్రస్తుతం ఇంకా లక్ష తక్కువ కావడం చర్చనీయాంశంగా మారింది.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY