Kamareddy: కామారెడ్డిలో ప్రారంభమైన వినాయక నిమజ్జనోత్సవం!
Kamareddy: కామారెడ్డి పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్; కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ.
Kamareddy: కామారెడ్డిలో ప్రారంభమైన వినాయక నిమజ్జనోత్సవం!
Kamareddy: కామారెడ్డి పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్రను మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ... వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగేలా భక్తులు, ప్రజలు, నిర్వాహకులు సహకరించాలని కోరారు. నిమజ్జన కార్యక్రమానికి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, Sp రాజేష్ చెంద్ర, DSP మధుసూదన్, నర్సింహా రెడ్డి, VHP ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.




