Kamareddy: రైతునగర్‌లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన పోచారం!

Kamareddy: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్‌లో కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కల్యాణ మండపం, మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించారు.

SALEEM, BANSWADA
Published on: 4 Nov 2026 4:26 PM IST
Kamareddy
X

Kamareddy: రైతునగర్‌లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన పోచారం!

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామం లో పలు అభివృద్ధి పనులను,శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి,కలెక్టర్ తో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు.కళ్యాణ మండపం నూతన భవనం,భోజన శాల,ఆహార ధాన్యాల నిల్వ కేంద్రం,మహిళా సమాఖ్య భవనం లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ,గ్రామ సర్పంచ్ మద్దినేని నాగరాజు కుమారి,మద్దినేని నాగేశ్వర రావు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.తమ స్వంత నిధులు ఖర్చు పెట్టీ గ్రామ ప్రజల కొరకు కళ్యాణ మండపానికి భోజన శాల,దాతల సహకారం తో వంటశాలను ఏర్పాటు చేసి,వినియోగానికి అందుబాటులో తెచ్చారని అభినందించారు. రైతునగర్ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన వారికి ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఆగ్రోస్ చైర్మెన్ కాసుల బాలరాజు, జిల్లా అధికారులతో పాటు,ఆర్ డీ ఓ రవీందర్ రెడ్డి,బీర్కూర్ ఏం పీ డీ ఓ శ్రీనిధి,తహసీల్దార్ సవాయి సింగ్,గ్రామ పెద్దలు,నాయకులు,సర్పంచులు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA