Kamareddy: పేదల సొంతింటి కల నెరవేరుతోంది: సర్పంచ్ ధర్మతేజ!
Kamareddy: కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ భూమిపూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనుమతి పత్రం అందజేశారు.
Kamareddy: పేదల సొంతింటి కల నెరవేరుతోంది: సర్పంచ్ ధర్మతేజ!
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పథకం లబ్ధిదారు సిద్ధంవార్ దుర్గవ్వ, W,/O పాపయ్య ఇంటి నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి, నిర్మాణ అనుమతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మ తేజ మాట్లాడుతూ,ప్రభుత్వం అర్హులు అయిన వారిని గుర్తించి, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగారం, వార్డు సభ్యులు ఖాజా నవాజ్ ఖాన్, జూనియర్ అసిస్టెంట్ హనుమంతరావు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, శంకర్, విజయ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.




