Banswada: ట్రాన్స్ఫార్మర్ కేంద్రంలో కట్టర్లతో కట్ చేసి చోరీ!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ టీజీఎస్పీడీసీఎల్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు కేంద్రంలో కిటికీలు, ఫెన్సింగ్ కట్ చేసి రూ.4 లక్షల విలువైన 250 కిలోల కాపర్ వైర్ ఎత్తుకెళ్లారు.
Banswada: ట్రాన్స్ఫార్మర్ కేంద్రంలో కట్టర్లతో కట్ చేసి చోరీ!
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని టీజీఎస్పీడీసీఎల్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు కేంద్రంలో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దుండగులు సుమారు 230 నుండి 250 కిలోల కాపర్ వైర్ ను దొంగిలించారు. దీని విలువ సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ప్రొఫెషనల్ దొంగలుగా భావిస్తున్నారు పోలీసులు. నిందితులు మరమ్మత్తు కేంద్రంలోని ఇనుప కిటికీల ఐరన్ రాడ్లను, ఫెన్సింగ్ ను కట్టర్ సహాయం తో కట్ చేసి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు.
ఈ కాపర్ వైర్ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఉపేందర్ రెడ్డికి చెందినదిగా తెలిసింది. చోరీపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫింగర్ ప్రింట్ బృందాన్ని పిలిపించి ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
ఇటీవల గాంధారిలో ఏటీఎం ను గ్యాస్ కట్టర్ సహాయంతో చోరీ చేసిన ఘటనను ప్రజలు మరువకముందే,అదే తరహాలోనే ఇక్కడ కూడా చోరీ జరగడం గమనార్హం.పట్టణ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరంగా చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.




