Banswada: ముగ్గుపోసి ఇంటి నిర్మాణం ప్రారంభించిన ఎంపీడీఓ ఆనంద్!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరులో లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ఎంపీడీఓ ఆనంద్ కుమార్, సర్పంచ్ నామ్దేవ్ ముగ్గుపోసి ప్రారంభించారు.

SALEEM, BANSWADA
Published on: 30 Oct 2026 12:35 PM IST
Banswada
X

Banswada: ముగ్గుపోసి ఇంటి నిర్మాణం ప్రారంభించిన ఎంపీడీఓ ఆనంద్!

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం లోని కొల్లూరు గ్రామం లో బండారి గంగారాం కు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యింది.ఈ రోజు తమ ఇంటి పనిని బాన్సువాడ మండల అభివృద్ధి అధికారి ఆనంద్ కుమార్,సర్పంచ్ నామ్దేవ్ తో కలిసి ముగ్గుపోసి ,పనులను ప్రారంభించారు.

మండలం లో ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయి ఉంది పనులు త్వ రగా ప్రారంభించి,పూర్తి చేసుకోవాలని,పనులు చేసుకున్న వారికి వారి ఖాతాలో డబ్బులు వస్తున్నాయని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏం పీ డీ ఓ ఆనంద్ కుమార్ తో పాటు,స్థానిక సర్పంచ్ నామ్దేవ్,జీ,పీ సెక్రటరీ ప్రవీణ్, ఉప సర్పంచ్ మజీద్,ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీ సభ్యులు ఏ చంద్ర హన్మండ్లు,బలరాం,దుర్గా రెడ్డి,బ్రహ్మం,తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA