Banswada: బాన్సువాడలో నూతన ఫంక్షన్ హాల్ ప్రారంభించిన పోచారం!
Banswada: బాన్సువాడ 1000 డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో రూ.1.40 కోట్ల వ్యయంతో నిర్మించిన సాంస్కృతిక కల్యాణ వేదిక భవనాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
Banswada: బాన్సువాడలో నూతన ఫంక్షన్ హాల్ ప్రారంభించిన పోచారం!
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 1000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీలో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించిన పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని 1000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీలో రూ.1 కోటి 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సాంస్కృతిక కళ్యాణ వేదిక భవనాన్ని (ఫంక్షన్ హాల్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి తో పాటు మాజీ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ శ్రీ కాసుల బాలరాజు పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు, పట్టణ ప్రజలకు వివాహాలు, శుభకార్యాలు, ఇతర సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ ఫంక్షన్ హాల్ ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు జంగం గంగాధర్,మహమ్మద్ ఎజాజ్,అబ్దుల్ వహాబ్,ముజ్జూ,బ్యాంకర్ రమేష్,రాజా శేఖర్,హకీమ్, నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




