Banswada: తాడ్కోల్ లో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలల సభ నిర్వహణ

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ పంచాయతీలో బాలల దినోత్సవం సందర్భంగా బాలల సభ నిర్వహించి, సామాజిక దురాచారాలపై తీర్మానించారు.

SALEEM, BANSWADA
Published on: 14 Nov 2026 9:46 PM IST
Banswada
X

Banswada: తాడ్కోల్ లో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలల సభ నిర్వహణ

బాన్సువాడ: జాతీయ బాలల దినోత్సవం సందర్భంగాకామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం లోని, తాడ్కోల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ అందే రమేష్ కుమార్ అధ్యక్షతన ఈ రోజు బాలల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించడం, ప్రసంగాలు చేయడం, చిత్రలేఖన ప్రదర్శనలు వంటి పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ బాలల సభలో బాలల హక్కులు, భద్రత, పోషణ, ఆరోగ్యం, రక్షణ మరియు అభివృద్ధి వంటి అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.

అలాగే బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు వంటి సామాజిక దురాచారాలను, మన గ్రామంలో పూర్తిగా నిర్మూలించాలని సభలో తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వీరేశం, పండరి, బత్తుల లక్ష్మీ, జుబేదా బేగం, గ్రామ పంచాయతీ కార్యదర్శి భరత్, ఐకేపీ CC సాయిలు, AEO రాణి, ఆశా కార్యకర్తలు, లైన్‌మెన్ రాములు, ZPHS తాట్కోల్ ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు సొసైటీ వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజి రెడ్డి, లక్ష్మా గౌడ్, హన్మండ్లు, అంజయ్య, సారగండ్ల హన్మండ్లు, ఇతర గ్రామస్తులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. బాలల హక్కులను కాపాడుదాం – బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA