Kamareddy: సిర్ సముందర్‌లో ఎల్‌నినో వాతావరణ పరిస్థితులపై రైతులకు అవగాహన!

Kamareddy: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సిర్ సముందర్‌లో ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన. యాసంగిలో ఆరుతడి పంటల సాగుకే ప్రాధాన్యం ఇవ్వాలని ఎఈఓ దయానంద్ సూచన.

VEERANNA, JUKKAL
Published on: 2 Nov 2026 12:49 PM IST
Kamareddy
X

Kamareddy: సిర్ సముందర్‌లో ఎల్‌నినో వాతావరణ పరిస్థితులపై రైతులకు అవగాహన!

Kamareddy: సిర్ సముందర్ (కామారెడ్డి ) రైతులు యాసంగి కాలంలో ఎలినో ప్రభావం తో ఏర్పడే దుస్పరిణామానాలు దృష్టిలో పెట్టుకొని ప్రతి వ్యవసాయ రైతు అరుతడి పంటలను మాత్రమే సాగు చెయ్యాలని వ్యవసాయ విస్తరణధీకారి దయానంద్ రైతులకు సూచించారు. సోమవారం బిచ్కుంద మండలం సిర్ సముందర్ గ్రామం లో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఎలినో వాతావరణ పరిస్థితులపై అవగాహన కల్పిస్తూ ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో భాగంగా యాసంగి కాలంలో ఏర్పడే సాగునిటి కొరత గురించి వివరించారు.

ప్రస్తుతం కొద్ది మొత్తం లో అందుబాటులో ఉన్న భూగర్భ జలాలను పొదుపుగా కాడుకుంటూ తక్కువ నీటితో సాగయ్యే పంటలను మాత్రమే సాగు చెయ్యాలన్నారు. అదేవిధంగా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంట సాగులో రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం క్రమక్రమంగా తగ్గిస్తూ వాటి స్థానంలో సేంద్రియ ఎరువులు, పురుగు మందులు వాడుకోవాలని సూచించారు. కార్యక్రమం లో సర్పంచ్ వినోద్, ఉప సర్పంచ్ రాజు తోపాటు వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL