Kamareddy: అంగన్వాడీ పౌష్టికాహార బియ్యం అక్రమ రవాణా - గ్రామస్తుల ఆగ్రహం

Kamareddy: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో అంగన్వాడీ కేంద్రం బియ్యం అక్రమ తరలింపును పట్టుకున్న గ్రామస్తులు. పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న సీడీపీఓ.

VEERANNA, JUKKAL
Published on: 16 Sept 2026 8:43 PM IST
Kamareddy
X

Kamareddy: అంగన్వాడీ పౌష్టికాహార బియ్యం అక్రమ రవాణా - గ్రామస్తుల ఆగ్రహం

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండెనేమ్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పంపిణీ చేయాల్సిన పౌష్టికాహార బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

స్థానికుల కథనం ప్రకారం, ఓ వ్యక్తి తెల్ల సంచిలో బియ్యాన్ని నింపుకుని తీసుకెళ్తుండగా అనుమానం వచ్చిన గ్రామస్తులు అతడిని అడ్డుకొని బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ విషయంపై ప్రశ్నించగా ఆ వ్యక్తి సరైన సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడినట్లు గ్రామస్తులు తెలిపారు.

చిన్నారులు, గర్భిణీలు, బాలింతల కోసం ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని అక్రమంగావిక్రయించేందుకు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని గ్రామస్తులు మండిపడ్డారు. ఈ అంగన్వాడీ కేంద్రంలో గతంలో కూడా ఇలాంటి అక్రమాలపై ఆరోపణలు వచ్చాయని వారు పేర్కొన్నారు.

గ్రామస్తులు అంగన్వాడీ టీచర్‌పై వెంటనే విచారణ జరిపి, అక్రమాలు నిజమైతేకఠినశాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ఉన్నతాధికారులు, జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. పసిపిల్లల నోటికొచ్చే ఆహారంపై దందా చేసే వారిని ఉపేక్షించవద్దని గ్రామస్తులు హెచ్చరించారు.

శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. సి డి పి ఓ.

బిచ్కుంద మండలం గుండె నేమ్లి గ్రామ ఎస్సి కాలనీ అంగన్వాడీ కేంద్రం నుండి అక్రమంగా బియ్యం తరలింపు పై వచ్చిన అభియోగం పై తాము అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పూర్తి విచారణ చేపట్టి బియ్యం తరలింపు వాస్తవమైతే అంగన్వాడీ టీచర్ పై చర్యలు తీసుకుంటామని సి డి పి ఓ రాథోడ్ కళావతి వెల్లడించారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL