Jukkal: ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం - 'గో గ్రీన్' ర్యాలీ

Jukkal: జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవ వేడుకలు. పట్టణంలో ఘనంగా 'గో గ్రీన్' ర్యాలీ నిర్వహణ.

VEERANNA, JUKKAL
Published on: 26 Sept 2026 5:54 PM IST
Jukkal
X

Jukkal: ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం - 'గో గ్రీన్' ర్యాలీ

జుక్కల్: జుక్కల్ (కామారెడ్డి ) ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్నిపురస్కరించుకుని కామారెడ్డి జిల్లా జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం “గో గ్రీన్” అవగాహన ర్యాలీ నిర్వహించారు.కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీ జుక్కల్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది.

విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలనే సందేశాలతో నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని విద్యార్థులు, అధ్యాపకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడితేనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్క నాటిదానినిసంరక్షించాలనిపిలుపునిచ్చారు.కార్యక్రమంలో స్టూడెంట్ కౌన్సిలర్ ఆర్. బాలాజీ, అధ్యాపకులు రమేశ్, సాయిలు, కుమారస్వామి, వలీందర్, నాయక్, సంతోష్, శ్రీధర్, నాగరాజ్, రామ్ నాయక్, సత్యం, సౌజన్యతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL