Jukkal: దళిత కుటుంబానికి న్యాయం చేయాలి టీఆర్పీ డిమాండ్
Jukkal: జుక్కల్లో ఇసుక ట్రాక్టర్ ఢీకొని దళిత కూలీ జలయ్య మృతి. మృతుని కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని టీఆర్పీ అధ్యక్షుడు ఖండేరావ్ డిమాండ్.
Jukkal: దళిత కుటుంబానికి న్యాయం చేయాలి టీఆర్పీ డిమాండ్
జుక్కల్: జుక్కల్ (కామారెడ్డి ) ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో ఏకైక ఎస్సి రిజర్వుడ్ నియోజకవర్గం ఐన జుక్కల్ నియోజకవర్గం లో గత 48 సంవత్సరాలు అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ద్వార చట్ట సభల్లోకి వెళ్తున్న నాయకులు అదే సామాజిక వర్గానికి చెందిన ఓ నిరుపేద కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఏమాత్రం స్పందించకపోవడం సిగ్గు చెటని (టి ఆర్ పి ) తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఖండే రావ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
జుక్కల్ మండలం మొహమ్మద బాద్ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకున్న ఘటన ఆయనను కలచి వేసింది. జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఓ నిరుపేద దళిత కుటుంబానికి చెందిన దినసరి కూలి చేసుకొని కుటుంబన్ని వెల్లదిసే కూలికి మితిమిరిన వేగంతో ఇసుక ట్రాక్టర్ డికొనడంతో ఆ దినసరి కూలి జలయ్య అక్కడికక్కడే తన ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబం ఏ దిక్కు లేని అనాధగా మిగిలిపోవడం ఇప్పుడు అందర్ని కలచివేయ్యడం అత్యంత బాధాకరమని ఉద్వేగానికి లోనయ్యారు.
జలయ్య మరణానికి కారణమైన ఇసుక ట్రాక్టర్ పై సమగ్ర విచారణ జరపాలి. టి ఆర్ పి డిమాండ్.
ఓ నిరుపేద దినసరి కూలి జలయ్య మరణానికి కారణమైన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పై రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సమగ్ర విచారణ జరుపాలని టి ఆర్ పి పార్టీ జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఖండే రావ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతని మృతి కి కారణమైన బాద్యులపై చట్టపరంగా కఠిన మైన చర్యలు తీసుకోవాలని మృతుడు జలయ్య కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే తగిన 20 లక్షల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
దింతోపాటు ఆ కుటుంబానికి అన్ని విధాలా ఆర్థిక భరోసాతోపాటు భవిషత్తు లో అతని కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించాలన్నారు. ఇకపై ఇసుక ట్రాక్టర్ల పై ప్రత్యేక నిఘా ఉంచుతు ట్రాక్టర్లు మితిమిరిన వేగాన్ని అరికట్టి ఇలాంటి ప్రమాదాలు పునరావృత్తం కాకుండ రెవెన్యూ, పోలీస్, రావణ శాఖ ద్వార పటిష్ట మైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇసుక ట్రాక్టర్ అతివేగానికి బలైన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన జలయ్య కుటుంబానికి ప్రభుత్వ పరంగా పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.




