Kamareddy: శేఖపూర్‌లో దగ్ధమైన పంటపొలాలు.. రైతులకు ఎమ్మెల్యే భరోసా!

Kamareddy: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం శేఖపూర్ గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన మొక్కజొన్న పంటలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పరిశీలించారు.

VEERANNA, JUKKAL
Published on: 30 April 2026 3:33 PM IST
Kamareddy
X

Kamareddy: శేఖపూర్‌లో దగ్ధమైన పంటపొలాలు.. రైతులకు ఎమ్మెల్యే భరోసా!

శేఖపూర్ (కామారెడ్డి): రైతులకు జరిగిన అపర నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వార తగిన నష్టపరిహారాన్ని అందేలా కావలసిన అన్ని విధాల చర్యలు తీసుకుంటానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు రైతులకు హామీ ఇచ్చారు. గురువారం ఆయన మద్నూర్ మండలం శేఖపూర్ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన మొక్క జొన్న పంట పొలాల్లో అగ్ని ప్రమాద ఘటన స్థలానికి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి చేరుకుని బాధిత రైతుల పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో మొక్క జొన్న పంట పొలాలకు అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ ఘటన పై పూర్తి వివరాలు సేకరించి అగ్ని ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ఎవరు అధైర్య పడవద్దని గట్టి హామీ ఇచ్చారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story