Jukkal: పర్యావరణ పరిరక్షణ డిండి యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే
Jukkal: జుక్కల్ మండలం దోస్త్‌పల్లి నుంచి రత్నగిరి నానిజ్ ధామ్ వరకు భక్తులు చేపట్టిన పర్యావరణ పరిరక్షణ డిండి యాత్రను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు.
Jukkal: పర్యావరణ పరిరక్షణ డిండి యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే
జుక్కల్ (కామారెడ్డి): జుక్కల్ మండలం దోస్త్‌పల్లి నుంచి మహారాష్ట్రలోని నానిజ్ ధామ్ (రత్నగిరి) వరకు చేపట్టిన డిండి యాత్రను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు.ప్రారంభ సందర్బంగా ఉప పీఠం లో ఎమ్మెల్యే తోట భక్తులతో కలిసి పల్లకి సేవలో భాగస్వాములై భక్తులతో పల్లకి మోశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా యాత్రలో పాల్గొని భక్తులతో కలిసి ముందుకు సాగారు.
గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే సందేశంతో నరేంద్ర మహారాజ్ భక్తులు ఈ దీండి యాత్రను నిర్వహిస్తున్నారు. యాత్రలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలు నాటి, పచ్చదనం పెంపొందించాల్సిన ఆవశ్యకతను వివరించారు.
భక్తి, ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక బాధ్యతలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీండి యాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం లో మద్నూర్ మార్కెట్ కమిటీ మాజి చైర్మన్ కె. సాయాగౌడ్,మద్నూర్ మార్కెట్ కమిటి చైర్మన్ భర్త అయిల్వర్ రమేష్, కాంగ్రెస్ పార్టీ జుక్కల్ మండల యూత్ అధ్యక్షుడు సతీష్ పాటిల్,మాధవ్ రావ్ దేశాయ్, శివానంద్, మనోహర్ పాటిల్, రాజులు, గంగు నాయక్,కొంచం అనిల్ తదితరులు పాల్గొన్నారు.




