Jukkal: అర్హులందరికీ నూతన పెన్షన్ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తోట

Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు అధికారులతో కలిసి నూతన పెన్షన్ పత్రాలను పంపిణీ చేశారు.

VEERANNA, JUKKAL
Published on: 15 Nov 2026 5:29 PM IST
Jukkal
X

Jukkal: అర్హులందరికీ నూతన పెన్షన్ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తోట

జుక్కల్: జుక్కల్ (కామారెడ్డి ) తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం జుక్కల్ నియోజకవర్గం లొని అన్ని మండలాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా నూతన పెన్షన్ల పంపినితో పాటు అర్హులైన వారికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పెన్షన్ పత్రాలను పంపిణి చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే తోట మాట్లాడుతు పెన్షన్ ప్రక్రియ అనేది నిరంతరం అని పెన్షన్ రాని ఏ ఒక్కరు నిరుత్సహ పడవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలలు అందించడమే ద్యేయంగా ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వం అని ఎమ్మెల్యే తోట పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందిస్తామని అన్నారు.

కార్యక్రమం లో డి ఆర్ డి ఏ పి డి, ఎం. సురేందర్,మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త అయిల్వర్ రమేష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధరస్వర్ సాయిలు,సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి,ధన్నూర్ దేవిదాస్ పాటిల్, ఎండోమెంట్ చైర్మన్ రాంపాటిల్, చౌల హన్మాండ్లు లతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL