Mohammadabad: మొహమ్మదాబాద్‌లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన

Mohammadabad: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మొహమ్మదాబాద్‌లో వై. ప్రకాష్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం. సర్పంచ్ సూర్నర్ శకుంతల ప్రగ్నేష్ కుమార్ ప్రారంభం.

VEERANNA, JUKKAL
Published on: 10 Nov 2026 4:50 PM IST
Mohammadabad
X

Mohammadabad: మొహమ్మదాబాద్‌లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన

మొహమ్మద బాద్: మొహమ్మద బాద్ (కామారెడ్డి ) ఆయుర్వేద వైద్య వృత్తి లో సుమారు 50 ఏండ్ల సుధీర్గ అనుభవం కల్గి ఉన్న ప్రముఖ ఆయుర్వేద వైద్యలు వై. ప్రకాష్ ఆధ్వర్యంలో చేపట్టుతున్న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరనికి ప్రజలు వినియోగించుకోవడం తో మంచి స్పందన లభిస్తుంది.

అందులో భాగంగానే మంగళవారం జుక్కల్ మండలం మొహమ్మద బాద్ గ్రామ పంచాయతీ లో నిర్వహించిన ఆయుర్వేద వైద్య శిబిరన్ని గ్రామ సర్పంచ్ సూర్నర్ శకుంతల ప్రగ్నెస్ కుమార్ (బాలు సార్ ) చేతుల మీదుగా ప్రారంభించారు. శిబిరం లో గ్రామ ప్రజలకు, రోగులకు అవసరమైన ఉచిత పరీక్షలు చేసి అవసరమైన వారికి ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణి చేసిపలు ఆరోగ్య జాగ్రత్త లు సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కల్తీ వస్తువులకు దూరంగా ఉంటు నాణ్యమైన వస్తువులను వాడుతూ ఆరోగ్యం కాపాడుకోవాలని హోటల్ తిను బండరాలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోరాదని పలు సూచనలు చేశారు. ఇంగ్లిష్ (అల్లోపతి ) మందుల కంటే ఆయుర్వేద మందులు ఎంతో ఉత్తమమైనవని వైద్యులు పేర్కొన్నారు.

ఆయుర్వేద మందుల వాడకం ద్వార ఏ ఒక్కరికి ఎలాంటి సైడ్ ఏపేక్ట్ ఉండవని ప్రజలు ఆయుర్వేద వైద్య సేవలను అలవార్చుకోవాలన్నారు.ఇలాంటి గ్రామాల్లో ఆయుర్వేద శిబిరలు నిర్వహించడం అభినందనియమని గ్రామ పంచాయతీ పాలకవర్గం వైద్య బృందనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమం లో ఉప సర్పంచ్ లక్ష్మణ్,న్యూట్రిషన్ నిపుణులు షేక్ సద్దాం,పంచాయతీ కార్యదర్శి జీవన్, జి పి ఓ. ఎన్ రాజు,బాశెట్టి, రాములు, కారోబారి గంగాధర్, పంచాయతీ సిబ్బంది శేషరావు తోపాటు ప్రజలు, రోగులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL