Jukkal: కరువు మండలాల ప్రకటనపై రైతన్నల హర్షాతిరేకాలు!
Jukkal: జుక్కల్, పెద్ద కొడప్గల్, మొహమ్మద్ నగర్ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడంపై రైతులు హర్షం. ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు కృతజ్ఞతలు.
Jukkal: కరువు మండలాల ప్రకటనపై రైతన్నల హర్షాతిరేకాలు!
జుక్కల్: జుక్కల్ (కామారెడ్డి ) వర్షధారం పై ఆధారపడి వ్యవసాయం చేస్తూ ప్రకృతి వైపరీత్యాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ అన్నదాతలకు ఎలాగైనా అండగా నిలువలనే దృఢ సంకల్పం తో రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలనే లక్ష్యం తో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి జుక్కల్ నియోజకవర్గం లొని జుక్కల్, పెద్ద కొడప్ గల్, మొహమ్మద్ నగర్ మండలాలను కరువు మండలలుగా ప్రకటించడం పై జుక్కల్ నియోజకవర్గ రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేలా జిల్లా కాలెక్టర్ సమన్వయం తో ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కు జుక్కల్ రైతులు, ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాతల ఆత్మ బంధువు అయిన ఎమ్మెల్యే కృషి, పట్టుదల కు అభినందనలు తెలుపుతు జుక్కల్ నియోజకవర్గన్ని ఒక పక్క ప్రణాళిక తో అభివృద్ధి తోపాటు రైతుల సంక్షేమనికి జుక్కల్ ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారనిపేర్కొన్నారు.
వర్షభావ పరిస్థితులతో వ్యవసాయం పై పూర్తిగా ఆధారపడినరైతులేదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మూడు మండలాలను కరువు మండలలుగా ప్రకటించడంపై జుక్కల్ రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మండల నియోజకవర్గ కేంద్రమైన జుక్కల్ మండల రైతులకు రాబోయే రోజుల్లో ఎలినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని తాగునిటీ ఇబ్బంది,పశుగ్రసం లభ్యత, ఉపాధి హామీ పనుల నిర్వహణ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని జుక్కల్ నాయకులు పేర్కొన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, సమన్వయం తో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టెందుకు కృషి చేస్తామని అన్నారు. కరువు పరిస్థితుల్లో రైతులకు అవసరమైన సహాయక చర్యలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, పశు గ్రాసం కొరత ఏర్పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రైతుల సంక్షేమమే లక్ష్యం గా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయం తో ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమం లో పెద్ద గుల్ల సర్పంచ్ మాధవ్ రావ్ దేశాయి, చిన్న గుల్ల సర్పంచ్ ఎల్. జ్ఞానేశ్వర్, బస్వాపూర్ సర్పంచ్ భర్త సురేష్ గొండ, మొహమ్మదబాద్ దేవుకతే ప్రజ్ఞేష్ కుమార్ (బాలాజీ ) తోపాటు పలువురు సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




