Jukkal: హన్మగౌడ్ త్వరగా కోలుకోవాలి: మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే!

Jukkal: జుక్కల్ మాజీ వైస్ ఎంపీపీ నేర్లవార్ హన్మగౌడ్‌ను ఆయన స్వగృహంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.

VEERANNA, JUKKAL
Published on: 6 Oct 2026 7:40 PM IST
Jukkal
X

Jukkal: హన్మగౌడ్ త్వరగా కోలుకోవాలి: మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే!

జుక్కల్: జుక్కల్ మండల సీనియర్ నాయకుడు , మాజీ వైస్ ఎంపీపీ నేర్లవార్ హన్మగౌడ్‌ను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించారు. హన్మగౌడ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆయన స్వగృహానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా హన్మగౌడ్‌తో ఆప్యాయంగా మాట్లాడిన హన్మంత్ షిండే.. వైద్యుల సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పరామర్శ కార్యక్రమంలో జుక్కల్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు, జుక్కల్ మాజి సర్పంచ్ బొల్లి గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి వాసరే రమేష్, మాజీ జడ్పీటీసీ కె.పండరి, బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు, లాడే గావ్ సర్పంచ్ రాజశేఖర్ పటేల్, సీనియర్ నాయకులు విజయ్ పటేల్, మండల బి ఆర్ ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు భాను గౌడ్‌తో పాటు యువ నాయకులు కిషన్, సందీప్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL