Rudrur: రుద్రూర్‌లో కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు!
Rudrur: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో బుధవారం కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఆన్లైన్ నమోదు పనులను సర్పంచ్ ఇందూరి సునీత పరిశీలించారు.
Rudrur: రుద్రూర్‌లో కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు!
నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల కేంద్రం లో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్లైన్ నమోదు చేయు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు స్థానిక సర్పంచ్ ఇందూరి సునీత చంద్ర శేఖర్ పరిశీలించారు. వచ్చే గ్రామ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు.
కుటుంబ బీమా నమోదు వచ్చే వారు కుటుంబ యజమాని ఆధార్ కార్డు,నామినీ పేరు ఆధార్ కార్డు జీరాక్స్ లు బ్యాంకు పాస్ బుక్ కాపీలు తీసుకుని రావాలని సూచించారు.నమోదు చేసే సిబ్బంది వచ్చే వారికి పూర్తిగా సహకరించాలని అన్నారు.




