Nizamabad: వర్ని రైతు వేదికలో వేగంగా ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు!
Nizamabad: వర్ని మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు ప్రక్రియ వేగంగా సాగుతోంది. అధికారుల పర్యవేక్షణలో రసీదులు అందజేస్తున్నారు.
Nizamabad: వర్ని రైతు వేదికలో వేగంగా ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు!
Nizamabad: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. స్థానిక రైతు వేదిక లో ప్రజలకు సౌకర్యవంతంగా,అన్ని ఏర్పాట్లు చేసి ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్లైన్ చేసి ,చేసుకున్న కుటుంబాలకు భీమా చేసుకున్నట్లు రసీదు ఇస్తున్నారు.
మండల స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్,మండల అభివృద్ధి అధికారి జి వెంకటేశం పరిశీలించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా,వారికి సందేహాలు కలుగకుండా, భీమా చేసిన తరువాత వారికి రసీదు ఇచ్చి పంపించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజ్ గౌడ్,ఏం పీ డీ ఓ వెంకటేశం,నాయకులు వెలగపూడి గోపాల్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




