Kamareddy: దామరంచలో వేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు!
Kamareddy: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. సర్పంచ్ బోయిని శంకర్ ఆధ్వర్యంలో స్లాబ్ పనులు ప్రారంభం.
Kamareddy: దామరంచలో వేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు!
Kamareddy: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం లోని దామరంచ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు చురుకుగా కొనసాగుతున్నాయిబుడ్డోళ్ళ సావిత్రి.ఇందిరమ్మ ఇంటి స్లాబ్ పనులను సర్పంచ్ బోయిని శంకర్ ఈ రోజు కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు.
సర్పంచ్ మాట్లాడుతూ,దామరంచ గ్రామానికి మొత్తం30 ఇండ్లు మంజూరయ్యాయని,వాటిలో ప్రస్తుతం 23 ఇండ్ల పనులు జరుగుతున్నాయని,ఇంకా 07 ఇండ్ల పనులు త్వరలో మొదలు మొదలవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇంటెనుక శంకర్,వార్డు మెంబర్లు గోల గంగారాం, లక్ష్మీనారాయణ,ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులు అహ్మద్,బాబాసాబ్,దావుగారి మొగులయ్యా,బాల కృష్ణ,బండారి రాజు తదితరులు పాల్గొన్నారు.




