Jukkal: జుక్కల్ నియోజకవర్గంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు!
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంఆర్పీఎస్ నేత సూర్యావంశీ తదితరులు పాల్గొన్నారు.
Jukkal: జుక్కల్ నియోజకవర్గంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు!
జుక్కల్: జుక్కల్ (కామారెడ్డి ) భారత రాజ్యాంగం మన దేశ ప్రజాస్వామ్యనికి బలమైన పునాది అని ప్రతి భారతీయ పౌరుడి హక్కులకు రక్షణ కవచం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతు బాధ్యత యుతమైన పౌరులుగా దేశాభివృద్ధికి తొడ్పడాలని సంకల్పిద్దామని ఎం ఆర్ పి ఎస్ జుక్కల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు సూర్యావంశీ మాదిగ అన్నారు.
బహుజనులకు స్వేచ్ఛ, సమానత్వం, సామజిక న్యాయం అనే రాజ్యాంగ ఆశయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పునరాంకితం కావాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ హక్కులను ప్రసాధించిన మహానుభావుడి ఆశయాలను స్మరించు కుంటు బాధ్యతయుతమైన పౌరులుగా దేశ అభివృద్ధి కి ప్రతి ఒక్కరు తొడ్పడాలన్నారు.
బాబాసాహెబ్ డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ 64 దేశాలు పర్యటించి మొత్తం రాజ్యాంగ విధి విధానాలు సేకరించిన మహానుభావుడు అంబేద్కర్ అని పలువురు కొనియాడుతూ నవంబర్ 26 వ తేదీన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకోచ్చిన రోజు కావున ఈ రాజ్యాంగాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.
రాజ్యాంగ నిర్మాణం లో బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి రెండు సంవత్సరాల 11 నెలల ఎనిమిది రోజులపాటు శ్రమపడి ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగిందని వారు తెలిపారు. కార్యక్రమం లో గాయాక్వాడ్ విజయ్, బోడ్కె హన్మంత్,మరోతి, భుజంగ్,మిలింద్, మద్దెల్ చెరువు గ్రామ సర్పంచ్ కళావతి గంగారాం, ఉప సర్పంచ్ హన్మాండ్లు, కార్యదర్శి రవి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు శివరాం, వార్డ్ సభ్యులు విట్టల్, సురేష్, సంతోష్, పద్మ తదితరులు పాల్గొన్నారు.




