Indalwai: లింగాపూర్ బ్రిడ్జి వద్ద అసంపూర్తి రోడ్డు పనులు, వాహనదారుల ఇబ్బందులు!

Indalwai: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లింగాపూర్ బ్రిడ్జి వద్ద అసంపూర్తి రోడ్డు పనులు, కంకర తేలి ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు.

M. RAMESH,NIZAMABAD
Published on: 3 Oct 2026 10:36 AM IST
Indalwai
X

Indalwai: లింగాపూర్ బ్రిడ్జి వద్ద అసంపూర్తి రోడ్డు పనులు, వాహనదారుల ఇబ్బందులు!

Indalwai: ఇందల్వాయి మండలం నుంచి ధర్పల్లి వైపు వెళ్లే ప్రధాన రహదారిలోని లింగాపూర్ బ్రిడ్జి వద్ద చేపట్టిన రోడ్డు పనులు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రహదారిపై కంకర వేసి పనులను అసంపూర్తిగా వదిలేయడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి జారిపడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కంకరపై జారుతున్న వాహనాలు.

ప్రమాదాల ముప్పు ప్రధాన రహదారిపై కంకర పరచిన అనంతరం రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, పనులు పూర్తికాకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు ఎక్కడ?

ఈ మార్గంలో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కంకరపై ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి జారిపడుతున్న ఘటనలు జరుగుతున్నాయని స్థానికుల వాదన. ఇప్పటికే పలువురు గాయాలపాలయ్యారని స్థానికులు తెలిపారు. అయినప్పటికీ రహదారి భద్రతకు తాత్కాలిక చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

కాంట్రాక్టర్ తీరుపై స్థానికుల ఆగ్రహం రోడ్డు పనుల పరిస్థితిపై కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా, “మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. కలెక్టర్‌కు చెప్తారో చెప్పుకోండి” అంటూ సమాధానం ఇచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై సంబంధిత కాంట్రాక్టర్ వివరణ ఏమిటన్నది తెలియాల్సి ఉంది.వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ లింగాపూర్ బ్రిడ్జి వద్ద రహదారి పరిస్థితిని సంబంధిత అధికారులు స్వయంగా పరిశీలించి, వాహనదారులకు ప్రమాదం కలగకుండా తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD