Banswada: చంటి బిడ్డతో ప్రజావాణికి హాజరైన ఐసీడీఎస్ అధికారిణి కస్తూరి!

Banswada: బాన్సువాడలో చంటి బిడ్డతో ప్రజావాణికి హాజరై విధులు నిర్వహించిన హనుమాజీపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి కస్తూరి అంకితభావంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

SALEEM, BANSWADA
Published on: 5 Oct 2026 6:10 PM IST
Banswada
X

Banswada: చంటి బిడ్డతో ప్రజావాణికి హాజరైన ఐసీడీఎస్ అధికారిణి కస్తూరి!

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హనుమాజీపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి కస్తూరి విధి నిర్వహణ పట్ల చిత్తశుద్ధి, బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి చంటి బిడ్డను వెంట తీసుకుని ప్రజావాణి కార్యక్రమానికి హాజరై, తన విధులను నిర్వర్తించడం అందరికీ ఆకట్టుకుంది.

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఆమె చంటి బిడ్డతో హాజరయ్యారు. కుటుంబ బాధ్యతలతో పాటు, ప్రభుత్వ విధులు కూడా అంతే ముఖ్యం అని, ప్రజావాణిలో పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగులకు విధి నిర్వహణ ఎంత ముఖ్యమో తన ఆచరణ ద్వారా చాటిచెప్పారని పలువురు పేర్కొన్నారు.

మహిళా ఉద్యోగులు కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న తీరుకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.ప్రజావాణి కి హాజరైన కస్తూరిని పలువురు అభినందించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA