Nizamabad: రాంపూర్ గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు!

Nizamabad: డిచ్‌పల్లి మండలం రాంపూర్ గ్రామంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 19 Oct 2026 6:25 AM IST
Nizamabad
X

Nizamabad: రాంపూర్ గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు!

Nizamabad: డిచ్ పల్లి మండలం రాంపూర్ గ్రామం లో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గ్రామంలోని మహిళలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి పెద్ద సంఖ్యలో మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు.

బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించాలనే సందేశాన్ని చాటిచెప్పారు. పూల పండుగైన బతుకమ్మ వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం స్థానిక చెరువులో బతుకమ్మ నిమజ్జనం చేశారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD