Nizamabad: నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్‌పల్లిలో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు!

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ, పంచాయతీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి.

M. RAMESH,NIZAMABAD
Published on: 18 Oct 2026 11:13 AM IST
Nizamabad
X

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్‌పల్లిలో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు!

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్ పల్లి గ్రామం లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లోక్కీడి యాదగిరి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పువ్వులను దైవంగా భావించే సంప్రదాయం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మనకు గర్వకారణం అని అన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకున్నారు.

తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి , గౌరమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలంతా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఒకచోట చేరి బతుకమ్మ ఆటలతో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.

ప్రకృతిని ఆరాధించడం, పూల ప్రాముఖ్యతను చాటిచెప్పడం ఈ పండుగ ప్రత్యేకత. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ తరతరాలుగా కొనసాగుతున్న విశిష్టమైన పూల పండుగగా గుర్తింపు పొందిందని అన్నారు. మహిళలందరూ గౌరమ్మకు పూజలు చేసి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లోక్కిడి యాదగిరి, మాజీ సర్పంచ్ బుసా సుదర్శన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,అసది రవీందర్, రాజారెడ్డి, గంగ సాయిలు,బొత్త సాయిలు, గంగాధర్, సూర శ్యామ్, సంజీవ్, దువ్వ నర్సింగ్, దేశ్ పెద్ది దేవిదాస్, గ్రామ ప్రజలు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD