Banswada: బాన్సువాడ బీడీ వర్కర్స్ కాలనీలో ఘనంగా కుంకుమార్చన

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్‌ కాలనీలో ఆదివారం మహిళలు భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు.

SALEEM, BANSWADA
Published on: 20 Sept 2026 4:18 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడ బీడీ వర్కర్స్ కాలనీలో ఘనంగా కుంకుమార్చన

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్‌ కాలనీలో ఆదివారం కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన చేసి అమ్మవారిని కొలిచారు. అనంతరం పరస్పరం కుంకుమను అందజేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. కాలనీవాసులంతా సామూహికంగా పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సందడిగా సాగింది.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA