Nizamabad: ఖిల్లా డిచ్‌పల్లిలో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవాలు వైభవంగా జరిగాయి. క్రేన్ సహాయంతో స్థానిక చెరువులో గణనాథులను నిమజ్జనం చేశారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 25 Sept 2026 5:55 PM IST
Nizamabad
X

Nizamabad: ఖిల్లా డిచ్‌పల్లిలో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం!

నిజామాబాద్: డిచ్ పల్లి మండలం ఖిల్లా డిచ్ పల్లి గ్రామం లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. 11 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు అందుకున్న గ్రామం లోని వినాయకులు ప్రత్యేక పూజలు అందుకున్న కొన్ని గణపతి ల వద్ద ఉన్న లడ్డులను వేలంపాటలో దక్కించుకున్న భక్తులు. యువత నృత్యాలతో నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది.

ప్రధాన వీధుల్లో గుండా గణేష్ శోభాయాత్ర నిర్వహించరు.చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని గణపతికి వీడ్కోలు పలికారు భక్తులు ఆనందంగా గణనాథుడిని సాగనంపుతూ, వచ్చే ఏడాది మరింత శుభాలతో తిరిగి రావాలని కోరుకున్నరు.

గ్రామ అభివృద్ధి కమిటీ, (VDC) సబ్యలు, అసది రవీందర్, కొంగ రాజా రెడ్డి, సర్పంచ్, లోక్కిడి యాదగిరి, VDC కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో క్రేన్ ఏర్పాటు చేశారు. క్రేన్ సహాయం తో గ్రామం లో ని గణపతి లను చెరువు లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ లోక్కిడి యాదగిరి, VDC సభ్యులు, అసది రవీందర్, కొంగ రాజా రెడ్డి, గ్రామ అభివృద్ధి సభ్యులు, ప్రజలు తదితరులు పాలుగోన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD