Banswada: బాన్సువాడలో ప్రజా వాణికి లభించిన విశేష స్పందన!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని అధికారులు తెలిపారు.
Banswada: బాన్సువాడలో ప్రజా వాణికి లభించిన విశేష స్పందన!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిషత్ కార్యాలయం లో ప్రజా వాణి కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను సత్వర పరిష్కారం కొరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా వాణి కార్యక్రమానికి, ప్రజలనుండి మంచి స్పందన లభిస్తోంది. రైతులు,ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావడానికి వేదికగా నిలుస్తోంది.
ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను,ఆయా శాఖల అధికారులు వారిని వెంటనే పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నారు. త్రాగు నీరు,సాగు నీరు,రోడ్లు,మురికి కాలువలు,పారిశుధ్యం,ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు,తదితర అంశాల పై అధికారులు దృషి పెట్టి,ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.
ఈ ప్రజా వాణి కార్యక్రమానికి ఏం పీ డీ ఓ ఆనంద్ కుమార్,మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్,తో పాటు ఆయా శాఖల బాధ్యులు పాల్గొన్నారు.




