Banswada: బాన్సువాడలో గాంధీజీకి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాళులు!

Banswada: బాన్సువాడలో ఘనంగా గాంధీ జయంతి గాంధీ చౌక్‌లో నివాళులర్పించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆదర్శాలు నిత్య స్ఫూర్తిదాయకమని పిలుపు.

SALEEM, BANSWADA
Published on: 2 Oct 2026 5:15 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో గాంధీజీకి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాళులు!

బాన్సువాడ: మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని గాంధీ చౌక్‌లో మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి, సహనం అనే విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్మ గాంధీ మహనీయుడని అన్నారు.

స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ చూపిన అహింసా మార్గం, ప్రజలను ఏకం చేసిన నాయకత్వం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన, సమానత్వం కలిగిన, సామాజిక న్యాయంతో కూడిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆలోచనలు, ఆదర్శాలు నేటి సమాజానికి మాత్రమే కాకుండా భావితరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ , బాన్సువాడ పట్టణ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొని మహాత్మ గాంధీకి నివాళులర్పించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA