Shantapur: గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ: RSETI
Shantapur: బిచ్కుంద మండలం శాంతపూర్ గ్రామంలో కెనరా బ్యాంక్ RSETI ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువత, మహిళలకు స్వయం ఉపాధి అవగాహన సదస్సు నిర్వహించారు.
Shantapur: గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ: RSETI
శాంతపూర్ (కామారెడ్డి): గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత, మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యం తో ఆర్ సి టి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్ సి టి ప్రతినిధి సూర్యాతేజ అన్నారు.
ఈ సందర్బంగా బిచ్కుంద మండలం శాంతపూర్ గ్రామం లో మంగళవారం కెనేరా బ్యాంకు ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించడం, ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్పించారు.
అవగాహన లో భాగంగా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వార అందించే శిక్షణ కోర్సులు, వాటి ద్వార కలిగే ప్రయోజనాల గురించి మహిళలు, యువతకు,గ్రామస్థులకు పూర్తి స్థాయిలో వివరించారు.
గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత కు ఉపాధి నైపుణ్యాలు అందించి స్వయం ఉపాధి వైపు అడుగులు వేయించడం లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో దోహద పడనున్నాయి. కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ కట్ట సంధ్య రెడ్డి, ఉప సర్పంచ్ ముత్యం రెడ్డి,రవి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.




