Madnoor: మద్నూర్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను జయప్రదం చేయండి

Madnoor: కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఉచిత పరీక్షలతో పాటు మందులు పంపిణీ చేస్తారు.

VEERANNA, JUKKAL
Published on: 1 Oct 2026 2:32 PM IST
Madnoor
X

Madnoor: మద్నూర్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను జయప్రదం చేయండి

మద్నూర్ (కామారెడ్డి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం లో ఈ నేల 2 న మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకొని ఎం.ఆర్. పి ఎస్ జుక్కల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు సూర్యావంశీ యాదవ్ సహకారం తో బాన్స్ వాడ సేవన్ హిల్స్ మల్టీ స్పెషలిటీ అస్పత్రి సౌజ్యన్యం తో నిర్వహిస్తున్న ఉచిత మేఘ హెల్త్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

మండలం లొని అన్ని గ్రామాల్లోని ప్రజలు ఈ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్యాంపు సందర్బంగా బాన్స్ వాడ సేవన్ హిల్స్ అస్పత్రి కి చెందిన డాక్టర్. వాగ్దేవి సామినేని ఎం. ఎస్ జనరల్ పిజీసియాన్, డాక్టర్. దివ్య భవాని గైనకాలజస్ట్, డాక్టర్. విశాల్ సింగ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ తోపాటు వివిధ విభాగలకు చెందిన వైద్య నిపుణులచే రోగులకు అవసరమైన వైద్య సలహాలు అందించి శిభిరం లో పాల్గొన్న రోగులకు ఉంచితంగా మందులు పంపిణి చెయ్యనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మద్నూర్ మండల ప్రజలకోసం ఏర్పాటు చేస్తున్న ఈ శిభిరన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL