Kamareddy: మద్నూర్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు, ఉచిత మెగా వైద్య శిబిరం!

Kamareddy: కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు.

VEERANNA, JUKKAL
Published on: 2 Oct 2026 6:01 PM IST
Kamareddy
X

Kamareddy:మద్నూర్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు, ఉచిత మెగా వైద్య శిబిరం!

Kamareddy: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మద్నూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు హాజరయ్యారు. చిన్న శేఖర్గ గ్రామానికి చెందిన యాదవ్ సూర్య వంశీ మాదిగ ఆధ్వర్యంలో,బాన్సువాడలోని సెవెన్ హిల్స్ మల్టి స్పెషలిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

వైద్య శిబిరనికి ముందు మద్నూర్ మండల కేంద్రం లోని మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ, మహాత్మా బసవశ్వర, బాబాసాహెబ్ అంబేద్కర్, అన్న బహు సాటే ల విగ్రహలకు పూలమాలలు వేసినివాళులర్పించారు.శిబిరంలో వైద్య బృందం ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించింది.పేద, సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు యాదవ్ సూర్య వంశీ మాదిగ తెలిపారు.

ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి నెలా ఒకసారి జుక్కల్ నియోజకవర్గంలోని ఒక్కో మండలంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు.జుక్కల్ నియోజకవర్గనికి చెందిన వాడిగా తన వంతు సేవ చేసి ప్రజల ఋణం తీర్చుకునేందుకు గాను స్వచ్ఛందగా ముందుకు వచ్చి ప్రజలకు ఉచితంగా ఆరోగ్య శిబిరలను నిర్వహించడం జరుగుతుందని సూర్యావంశీ పేర్కొన్నారు.

ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.కార్యక్రమం లో మద్నూర్ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి,మాజి మార్కెట్ కమిటి చైర్మన్ నాగనాథ్ పాటిల్, కొడ్చిర సంగమేశ్వర్,బిజెపి నాయకులు రామగౌడ్, వెంకట్ కాళే,ఎం ఆర్ పి ఎస్ నాయకులు విజయ్ గాయాక్వాడ్, భుజంగ్, దశరథ్, సేవన్ హిల్స్ వైద్యులు డాక్టర్. వాగ్దేవి సామినేని జనరల్ మెడిసన్ పిజీసియాన్, డాక్టర్.కె. దివ్య భవాని గైనకాలజస్ట్,డాక్టర్. మధుకర్ సిరసు జనరల్ సర్జన్,డాక్టర్. శ్రీనివాస్ కేతావత్ కాన్సల్టెంట్ ఆర్థోపెడిక్,సేవన్ హిల్స్ అస్పత్రి యాజమాన్యం ప్రవీణ్ రెడ్డి,బోడ్కె హన్మంత్,లక్ష్మణ్,డి.గంగాధర్,అన్వర్, రాజేష్ తల్వరే, మరుతి మహారాజ్, తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL