Nizamabad: వర్ని రామాలయం వద్ద షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ!

Nizamabad: నిజామాబాద్ జిల్లా వర్నిలో బోధన్ మరియు వర్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు.

SALEEM, BANSWADA
Published on: 8 Oct 2026 1:45 PM IST
Nizamabad
X

Nizamabad: వర్ని రామాలయం వద్ద షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ!

Nizamabad: వర్నిలోని రామాలయం వద్ద బోధన్ లయన్స్ క్లబ్ , వర్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం ఈ రోజు నిర్వహించారు.షుగర్ ,బీ పీ రోగులకు పరీక్షలు నిర్వహించి,వారికి మందులను పంపిణీ చేశారు.బీదవారికి,సేవ చేయాలనే సంకల్పం తో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వర్ని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నూనె శ్రీనివాస్, సర్పంచ్ కనకదుర్గ రవి , లయన్స్ క్లబ్ హనుమంతరావు , స్వామి వివేకానంద ఫౌండేషన్ ఫౌండర్ సంతోష్, తరుణ్ ,లయన్స్ క్లబ్ సభ్యులు,డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA