Jukkal: కామారెడ్డి జిల్లా కౌలస్‌లో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన!
Jukkal: జుక్కల్ మండలం కౌలస్ గ్రామంలో సర్పంచ్ విద్య బలరాం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందుల పంపిణీ.
Jukkal: కామారెడ్డి జిల్లా కౌలస్‌లో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన!
Jukkal: కౌలస్ (కామారెడ్డి ) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలస్ గ్రామంలో గ్రామ సర్పంచ్ విద్య బలరాం ఆధ్వర్యంలో, జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
శిబిరంలో భాగంగా గ్రామ ప్రజలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. అలాగే వ్యాధుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, గ్రామ పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ విద్య బలరాం మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలనుప్రజలుసద్వినియోగం చేసుకోవాలనిసూచించారు.
కౌలస్ గ్రామంలో ఇలాంటి శిబిరం నిర్వహించడం సంతోషంగాఉందని,భవిష్యత్తులో కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మరిన్ని వైద్యశిబిరాలునిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పూజారి గణేష్ ముదిరాజ్, ఎంఎల్‌హెచ్‌పీ కోటగిరి మాధవ్,విశ్వనాథ్ పంతులు, గంగాధర్,ఏఎన్‌ఎం స్వరూప రాణి, ఆశా కార్యకర్తలు జె. గంగామణి, శైలజ, లక్ష్మి, స్వరూప, కె. గంగామణి తదితరులు పాల్గొన్నారు.




