Nizamabad: ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు వరి ధాన్యం దగ్ధం
Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల వల్ల కౌలు రైతు సురేష్‌కు చెందిన 105 వడ్ల బస్తాలు దగ్ధమయ్యాయి.
Nizamabad: ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు వరి ధాన్యం దగ్ధం
నిజామాబాద్ జిల్లా: డిచిపల్లి గ్రామానికి వెళ్ళు దారిలో లోడింగ్ సిద్ధంగా ఉంచిన వడ్లబస్తాలకు ప్రమాదవశాత్తు దగ్ధమైన ఘటన శుక్రవారం చోటుచేసుకున్నది. రెవెన్యూ, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కౌలు రైతు వరాల సురేష్ చెందిన ధాన్యం బస్తాలను ప్రధాన దారి పక్కన సిద్దంగా ఉంచారు. లారీల రాక ఆలస్యం కావడంతో రోడ్డుపైనే 105 బస్తాల వరకు నిల్వ ఉంచారు.
మధ్యాహ్నం సమయంలో భారీ ఎండకారణంగా రైతు ఇంటికి వెళ్లగా... గుర్తు తెలియని వ్యక్తులు దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో సిగరేటు తాగి పడివేయడం వల్ల గాలికి నిప్పు ధాన్యం సంచుల వరకు వచ్చి అంటుకున్నది. దారిన వెళ్లెవారు సంబంధిత రైతుకు సమాచారం అందించడంతో రెవిన్యూ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక శకటం వచ్చి మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనలో ధాన్యం కాలిపోవడంతో 1 లక్ష వరకు నష్టం వాటిల్లింది. ఘటన స్థలంను ఆర్.ఐ సంతోష్, మండల వ్యవసాయాధికారి ఆంజనేయులు, పోలీసులు వచ్చి పంచానమా చేశారు.




