Banswada: కవల శిశువుల వైద్యం కోసం రూ.45,400 ఆర్థిక సాయం అందజేత!

Banswada: వర్ని మండలం జలాల్‌పూర్ కవల శిశువుల వైద్యం కోసం వాట్సాప్ ద్వారా స్పందించి రూ.45,400 ఆర్థిక సాయం అందించి మానవత చాటుకున్నారు.

SALEEM, BANSWADA
Published on: 4 Oct 2026 7:55 PM IST
Banswada
X

Banswada: కవల శిశువుల వైద్యం కోసం రూ.45,400 ఆర్థిక సాయం అందజేత!

Banswada: వర్ని మండలంలోని జలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన తిప్పారం ఆనంద్‌గౌడ్‌ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా, హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కవల శిశువులకు మానవతా హస్తం అందింది. శిశువుల పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న కుటుంబానికి సాయం చేయాలని గ్రామానికి చెందిన కొందరు సీతలే రమేష్‌ దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన సమాజ సేవకుడు సీతలే రమేష్‌ తన వాట్సాప్‌ ద్వారా సహాయం కోరారు. దీనికి స్పందించిన తమ గ్రూప్ దాతల నుంచి నిధులు సమీకరించి, ఆదివారం జలాల్‌పూర్‌ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ బంధువులకు రూ.45,400 నగదును అందజేశారు. ఆపద సమయంలో చిన్నారుల చికిత్సకు అండగా నిలిచిన సీతలే రమేష్‌ సేవా దృక్పథాన్ని గ్రామస్థులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో బుర్ఖా శంకర్‌గౌడ్‌, కొయ్యడ శ్రీనివాస్‌గౌడ్‌, సుధాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకట్‌గౌడ్‌తో పాటు గ్రామ యువకులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు సీతాలే రమేష్ కు అభినందించి,ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.దేవుడు ఈ లాంటి వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి,మరిన్ని సేవలు చేసే భాగ్యం కల్పించాలని ప్రార్థించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA