Birkur: బీర్కూరు జూనియర్ కళాశాల వాటర్‌మెన్ గంగాధర్‌కు ఘన వీడ్కోలు!

Birkur: కామారెడ్డి జిల్లా బీర్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వాటర్‌మెన్ దువ్వల గంగాధర్‌ ఉద్యోగ విరమణ. కళాశాలలో ఘనంగా వీడ్కోలు సభ, సన్మాన కార్యక్రమం.

SALEEM, BANSWADA
Published on: 1 Nov 2026 7:46 AM IST
Birkur
X

Birkur: బీర్కూరు జూనియర్ కళాశాల వాటర్‌మెన్ గంగాధర్‌కు ఘన వీడ్కోలు!

Birkur: కామారెడ్డి జిల్లా బీర్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాటర్‌మెన్‌గా విధులు నిర్వహించిన దువ్వల గంగాధర్ ఈ రోజు ఉద్యోగ విరమణ పొందారు.ఈ సందర్భంగా శనివారం ఘనంగా కళాశాలలో వీడ్కోలు సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మామిళ్ళ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గంగాధర్ కళాశాలలో అందించిన సేవలను అభినందించారు. తన విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, కళాశాల అభివృద్ధిలో భాగస్వామిగా నిలిచారని కొనియాడారు. ఆయన సేవలు, క్రమశిక్షణ, అంకితభావం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం హాజరై గంగాధర్ సేవలను ప్రశంసించారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన కుటుంబంతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్మ తేజ, నాయకులు రఘు, విట్టల్, AAP చైర్‌పర్సన్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొని గంగాధర్‌కు ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA