Bodhan: హెచ్ఎంటీవీ వెబ్ కథనానికి ఎక్సైజ్ శాఖ స్పందన!
Bodhan: హెచ్ఎంటీవీ వెబ్ కథనానికి తక్షణ స్పందన: గాంధీ జయంతి డ్రై డే నాడు అక్రమ మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ దాడి.. జానకంపేటలో 30 బాటిళ్ల దేశీదారు స్వాధీనం, ఒకరు అరెస్ట్.
Bodhan: హెచ్ఎంటీవీ వెబ్ కథనానికి ఎక్సైజ్ శాఖ స్పందన!
బోధన్: గాంధీ గాంధీ జయంతి రోజున నిబంధనలకు తూట్లు అనే కథనాన్ని శుక్రవారం హెచ్ఎంటీవీ వెబ్ లో ప్రచురితమవ్వడంతో ఎక్సైజ్ శాఖ యంత్రాంగం స్పందించింది. ఎడపల్లి మండలం జానకంపేటలో నిర్వహిస్తున్న బెల్ట్ షాప్ పై దాడి చేసి సుమారు 30 బాటిల్ల దేశిదారును ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు.
బోధన్ ఆప్కారి సిఐ భాస్కరరావు నేతృత్వంలో ఎస్సై జీవన్ రెడ్డి పలు ప్రాంతాల్లో గస్తీ నిర్వహించి మద్య విక్రయాలను కట్టడి చేశారు. జానకంపేటలో బెల్ట్ షాప్ పై దాడి నిర్వహించి శేఖర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.




