Bodhan: అక్రమ కల్లు దుకాణాలపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మెరుపు దాడులు!
Bodhan: బోధన్, ఎడపల్లి మండలాల్లో అక్రమ కల్లు దుకాణాలపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసిన ఎస్ఐ జీవన్ రెడ్డి.
Bodhan: అక్రమ కల్లు దుకాణాలపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మెరుపు దాడులు!
బోధన్: బోధన్ మండలం ఊట్పల్లి గ్రామంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించి పలు కల్లు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ఎక్ససైజ్ ఎస్ ఐ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమ కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించి పలువురుపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.
అనుమతులు ఒకచోట దుకాణాలు మరోచోట నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో బోధన్ ఎడపల్లి మండలాల్లో దాడులు నిర్వహించిన అనుమతులు లేని కళ్ళు దుకాణలపై ఎక్సైజ్ సీఐ ఆదేశానుసారం పలు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. అనుమతు లు లే కుండా కల్లు విక్రయాలు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలు దుకాణ యజమానులకు నిబంధనలు పాటించాలని సూచించినట్లు జీవన్ రెడ్డి తెలిపారు.




