Nizamabad: ఎక్సైజ్ శాఖ బాసర జోన్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!
Nizamabad: ఎక్సైజ్ శాఖ బాసర జోన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ రాజ్యలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ శ్రీధర్ వేడుకల్లో పాల్గొన్నారు.
Nizamabad: ఎక్సైజ్ శాఖ బాసర జోన్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!
Nizamabad: నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ బాసర జోన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎక్సైజ్ ఉద్యోగినిలు బతుకమ్మ ఆటపాటలతో సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పువ్వులను దైవంగా భావించే సంప్రదాయం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మనకు గర్వకారణం అని అన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటామన్నారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి , గౌరమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలంతా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఒకచోట చేరి బతుకమ్మ ఆటలతో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.
ప్రకృతిని ఆరాధించడం, పూల ప్రాముఖ్యతను చాటిచెప్పడం ఈ పండుగ ప్రత్యేకత. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ తరతరాలుగా కొనసాగుతున్న విశిష్టమైన పూల పండుగగా గుర్తింపు పొందింది.
ఈ బతుకమ్మ వేడుకల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ అరుణ్ కుమార్, డిపిఓ నంద గోపాల్, తిరుపతి, శ్రీనివాస్ లు జోన్ కమిటీ సభ్యులు కైలాస్ పవర్, లింబాద్రి, చల్ల బాబు, విజయ్ నంద్, సిడి టు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సునీల్ కంబ్లి, రవి, మహిళ కానిస్టేబుళ్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.




