Jukkal: మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే!
Jukkal: ప్రకృతి పరిరక్షణ కోసం తెలంగాణ నుంచి మహారాష్ట్ర నానిజ్ ధామ్ వరకు సాగుతున్న మహా పాదయాత్రలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొని సంఘీభావం తెలిపారు.
Jukkal: మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే!
Jukkal: జుక్కల్ (కామారెడ్డి ) ప్రకృతి పరిరక్షణ, భూమి, నీరు, చెట్ల సంరక్షణ కోసం తెలంగాణ నుంచి మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా నానిజ్ ధామ్ వరకు కొనసాగుతున్న మహా పాదయాత్రకు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సంఘీభావం తెలిపారు. జుక్కల్ మండలం దోసపల్లి సంస్థాన్ శ్రీ జగద్గురు రామానందాచార్య జీ మఠం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆధ్యాత్మిక పాదయాత్ర భక్తి భావంతో పాటు ప్రకృతి పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. మహారాష్ట్రలోని ఏలి గ్రామంలో కొనసాగుతున్న మహా పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొని భక్తులతో కలిసి పాదయాత్రలో అడుగులు వేశారు.
అనంతరం శ్రీ జగద్గురు రామానందాచార్య జీని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించాలనే సంకల్పంతో చేపట్టిన ఈ మహా పాదయాత్రఎంతోగొప్పదనిఅన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతిఒక్కరూచెట్లనుపెంచడంతో పాటు నీరు, భూమి, ప్రకృతి వనరులను కాపాడుకోవాలని సూచించారు.ప్రకృతి పరిరక్షణ కోసం చేపట్టిన ఈ మహా పాదయాత్రకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హన్మంత్ షిండే తెలిపారు.
భక్తులు, మఠం నిర్వాహకులు, పాదయాత్రికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఆధ్యాత్మికతతో పాటుప్రకృతిసంరక్షణసందేశాన్నిప్రజల్లోకితీసుకెళ్తున్నారు.“ప్రకృతిని కాపాడుదాం భవిష్యత్ తరాలను రక్షిద్దాం” అనే పవిత్ర సంకల్పంతో మహా పాదయాత్ర ముందుకుసాగుతోంది.కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ జుక్కల్ నాయకుడు వష్రె. రమేష్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.




